Chemical factory : వేసవి కావడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు (Fire accident) చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోగల వత్వా GIDC లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ (Chemical factory) లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతుండటంతో మంటలను ఆర్పడం కష్టంగా కొంత కష్టతరంగా మారింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat | Fire breaks out in a chemical factory located in Vatva GIDC in Ahmedabad; Operation underway to douse the fire
Details awaited. pic.twitter.com/JBFOzlEYy2
— ANI (@ANI) May 2, 2025