ముంబై: ఆత్మహత్య చేసుకునేందుకు ఒక యువకుడు రైలు వస్తుండగా పట్టాలపైకి దూకాడు. గమనించిన రైల్వే పోలీస్ ధైర్యం చేసి అతడ్ని కాపాడారు. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విఠల్వాడి రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్ అంచున 18 ఏండ్ల యువకుడు నిల్చొని ఉన్నాడు. లోకమాన్య తిలక్ టెర్మినల్- మధురై ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆ స్టేషన్ను క్రాస్ చేయనున్నది. దీంతో ఆ యువకుడ్ని వెనక్కి జరుగాలని జీఆర్పీ కానిస్టేబుల్ మానే చెప్పారు. అనంతరం నడిచి కాస్త ముందుకు వెళ్లిన ఆయన ఆ యువకుడు వెనక్కి వెళ్లాడా లేదా అని తిరిగి చూశారు.
అయితే రైలు సమీపిస్తుండగా ఆత్మహత్య కోసం ఆ యువకుడు ఒక్కసారిగా ఫ్లాట్ఫామ్ నుంచి రైలు పట్టాలపై దూకాడు. తృటిలో గమనించిన రైల్వే కానిస్టేబుల్ మానే తొలుత కొంత తటపటాయించారు. రైలు సమీపిస్తుంటడంతో యువకుడ్ని కాపాడేందుకు ధైర్యం చేశారు. కాస్త వెనక్కి వెళ్లి వేగంగా రైలు పట్టాలపైకి ఆయన జంప్ చేశారు. వెంటనే యువకుడ్ని రైలు పట్టాల నుంచి అవతలకు తోస్తూ వెళ్లారు. అనంతరం మూడు సెకండ్లలో ఆ ఎక్స్ప్రెస్ రైలు ఆ స్పాట్ నుంచి వేగంగా వెళ్లి స్టేషన్ను క్రాస్ చేసింది.
మరోవైపు ఆ యువకుడు, రైల్వే కానిస్టేబుల్ మానేకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ ఘటన వల్ల ఆ యువకుడు చాలా సేపటి వరకు షాక్ నుంచి తేరుకోలేదు. అతడు ఆత్మహత్యకు యత్నించడంతో తల్లిదండ్రులను రైల్వే పోలీసులు పిలిపించారు. కాగా, ఆ రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యువకుడ్ని కాపాడిన రైల్వే పోలీసు సమయస్ఫూర్తి, ధైర్య సాహసాన్ని అధికారులతోపాటు నెటిజన్లు అభినందించారు.
A 35-year-old government railway police (GRP) constable jumped on the railway tracks moments before an express train was to pass to save an 18-year-old who allegedly tried to die by suicide at Vithalwadi railway station @SachinKalbag @htTweets @HTMumbai pic.twitter.com/UA4NCf8lXF
— Megha Pol (@Meghapol) March 23, 2022