లక్నో: అయోధ్యలో ఘనంగా దీపావళి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయోధ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై పలు పౌరానిక నాటకాలు వేసి అలరించారు. ఈ ఉత్సవాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామాయణ నాటకంలో భాగంగా రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వేషధారణలో ఉన్న కళాకారులకు యోగీ పూలమాలలు వేసి సత్కరించారు.
అంతేగాక ఈ సాయంత్రం అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనున్నారు. మొత్తం 13 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ రికార్డు నెలకొల్పనున్నారు. కాగా, దీపావళి ఉత్సవాల్లో యోగీ ఆదిత్యనాథ్ కళాకారులకు పూలమాలలు వేసి సత్కరించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
#WATCH CM Yogi Adityanath garlands artists playing characters of Lord Ram, Lord Laxman and Goddess Sita during Diwali celebrations at Ayodhya pic.twitter.com/vVeyD4HW01
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 3, 2021
#WATCH | Ambassadors of Vietnam, Kenya and Trinidad and Tobago to India perform 'Rajtilak' of artists playing characters of Lord Ram, Lord Laxman and Goddess Sita during Diwali celebrations in Ayodhya pic.twitter.com/WMKOhDV3qm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 3, 2021