Sangeeta Azad : ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ సంగీతా ఆజాద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె యూపీలోని లాల్గంజ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమెతోపాటు ఆమె భర్త ఆజాద్ అరి మర్దన్ కూడా పార్టీకి రాజీనామా సమర్పించారు.
బీఎస్పీకి రాజీనామా అనంతరం ఎంపీ సంగీతా ఆజాద్ దంపతులు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది సీమా సమ్రిధి అలియాస్ కుశ్వాహ కూడా బీజేపీలో చేరారు. ఈ ముగ్గురు నేతలు బీజేపీలో చేరిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.