TN BSP chief : తమిళనాడు బీస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసు నిందితుల్లో ఒకరిని ఆ రాష్ట్ర పోలీసులు హతమార్చారు. లొంగిపొమ్మని హెచ్చరించిన పోలీసులపై కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులకు ఆదివారం ఉదయం చెన్నై సమీపంలోని మాధవరం ఏరియాలో ఒక నిందితుడు తారసపడ్డాడు.
దాంతో పోలీసులు అతడిని లొంగిపొమ్మని హెచ్చరించారు. కానీ అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో హతమయ్యాడు. చెన్నై నార్త్ అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ నరేంద్ర నాయర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఎన్కౌంటర్లో మరణించిన నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
#WATCH | Tamil Nadu: Thiruvengadam, an accused in the murder case of Tamil Nadu BSP state president K Armstrong, was killed in a police encounter in Madhavaram area near Chennai.
Additional Commissioner of Police, Chennai North, Narendra Nair said, “The encounter took place… pic.twitter.com/qzNVseoWhL
— ANI (@ANI) July 14, 2024
కాగా, ఈ నెల 5న తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు కే ఆర్మ్‌స్ట్రాంగ్‌ను తన ఇంటికి సమీపంలోనే బైకులపై వచ్చిన ఆరుగురు దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్యను బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.