(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ, జూలై 21 : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ నిరాహార దీక్షను చేపట్టడం పెద్దయెత్తున చర్చకు దారితీసింది. ఈ విషయంలో అధికార బీజేపీ వైఖరిని తప్పుబడుతూ రాజకీయ లబ్ధిపొందాలని కాంగ్రెస్ తహతహలాడింది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించింది.
దీంతో కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. ‘లద్దాఖ్‌లో ఓ స్థిరాస్తి విషయమై వాంగ్చుక్కు చెందిన ఎన్జీవోకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు పంపించింది’ అంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ మాలవీయా ఓ డాక్యుమెంట్‌ను షేర్ చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.