Assembly Elections | నాగాలాండ్, మేఘాలయలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
Assembly Elections | ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది. రెండు రాష్ట్రాల్లో 60 చొప్పున స్థానాలున్నప్పటికీ 59 సీట్లకే ఎన్నికలు జరుగుతున్నాయి. మేఘాలయలో సోహియాంగ్‌లో (Sohiong) నియోజకవర్గ యూడీపీ (UDP) అభ్యర్థి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదాపడింది. ఇక నాగాలాండ్‌లోని అకులుటో (Akuluto) స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఉన్నారు.

మేఘాలయాలో (Meghalaya) ఎన్నికలు జరుగుతున్న 59 స్థానాల్లో 369 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 36 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం అధికారులు 3419 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా అధికార ఎన్పీపీ (NPP), కాంగ్రెస్ పార్టీ మధ్యే ఇక్కడ పోటీ నెలకొన్నది.
ఇక నాగాలాండ్‌లో మొత్తం 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 13 లక్షల మంది ఓట్లు వేయనున్నారు. ఇక్కడ అధికార ఎన్డీపీపీ (NDPP), బీజేపీ పొత్తుపెట్టుకోగా, కాంగ్రెస్ (Congress), ఎన్సీపీ, జేడీయూ, ఎన్పీపీలు వాటికి పోటీనిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

