న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వితుల్ కుమార్ స్వీకరించబోతున్నారు. ఆయన ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుత డీజీ అనీష్ దయాల్ సింగ్ మంగళవారం పదవీ విరమణ చేయబోతున్నారు. అనంతరం కుమార్ ఈ బాధ్యతలను చేపడతారు. రెగ్యులర్ డీజీ నియామకం జరిగే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు కుమార్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. కుమార్ 1993 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి.