Viral Video | వాహనదారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.2.5లక్షల జరిమానా విధించడంతో పాటు సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ని సైతం రద్దు చేశారు. అంబులెన్స్‌కు ఉన్న పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వాహనం యజమాని దారి ఇవ్వకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎవరైనా హారన్ ఇచ్చిన సందర్భంలో దారి ఇస్తుంటారు. ముఖ్యంగా అంబులెన్స్‌లు వచ్చిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా దారి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా డ్రైవర్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఎదురుగా వెళ్తున్న కారును దాటి అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఏమాత్రం సైడ్ ఇవ్వలేదు. అంబులెన్స్ సైరన్ మోగుతున్నా.. వాహనం హారన్ ఇస్తున్నా కారు యజమాని ఏదేమీ పట్టించుకోలేదు. అయితే, అంబులెన్స్‌లోనే ఉన్న మరో వ్యక్తి కారు యజమాని ప్రవర్తనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో కేరళ పోలీసులు స్పందించారు. సదరు కారు యజమాని ఇంటికి వెళ్లి రూ.2.5లక్షల జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ని సైతం రద్దు చేసినట్లు తెలుస్తున్నది. కారు యజమాని తీరుపై పలువురు యూజర్లు విమర్శలు గుప్పించారు. రోడ్డు భద్రతా నియమాలు, చట్టాల్లో భాగంగా అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ఓ ముఖ్యమైన అంశమని, దానికి దారి ఇవ్వని వారు శిక్షార్హులని నిర్ధారించగలరా? అంటూ ఓ యూజర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేశారు. కారు యజమాని ప్రవర్తన సిగ్గుచేటని ఒకరు.. కొందరిలో కనీస స్పృహ లేకుండాపోతుందని మరో యూజర్ పేర్కొన్నారు.
Car Owner Fined ₹2.5 Lakh and License Revoked for Blocking Ambulance#Kerala #Car #Ambulance
Read Full Story Herehttps://t.co/tjv0yCkua7 pic.twitter.com/NLtqUJjCcR
— The Munsif Digital (@munsifdigital) November 17, 2024