న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో వీడియో రికార్డింగ్‌ను నిషేధించినా మెట్రో లోపల అభ్యంతరకర వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఢిల్లీ మెట్రో రైల్లో ఇద్దరు మహిళల పోల్ డ్యాన్సింగ్ క్లిప్ నెట్టింట తెగ వైరలవుతోంది.
పర్వీన్ బాబీ, శశి కపూర్లు నటించిన సుహాగ్ సినిమా నుంచి మే తో బేగార్ హూ సాంగ్‌కు ఇద్దరు మహిళలు డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. హస్న జరూరి హై అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఢిల్లీ మెట్రోలో కన్వరియాల బృందం డ్యాన్స్ చేసిన వీడియో కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
After porn, kissing and fighting in Delhi Metro,
The latest is Pole Dancing…..
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023
శివ భక్తులైన కన్వరియాలు శ్రావణ మాసంలో హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, సుల్తాన్ గంజ్ వంటి ప్రాంతాలను సందర్శించి అక్కడి పవిత్ర గంగా జలంలో స్నానాలు చేస్తారు. ఇక ఈ ఏడాది కన్వర్ యాత్ర జులై 4న ప్రారంభమైంది.
Read More :