న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో క్యూట్ యానిమల్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఉడుతలకు కుర్కురే తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 10,000కు పైగా వ్యూస్ లభించాయి.
जो दर्द के अहसास को समझता है
वही दुसरों की मदद कर सकता है ❤️ pic.twitter.com/lCHnoNHkal— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 9, 2022
ఈ వైరల్ వీడియోలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి ప్యాకెట్లో చిప్స్ తింటుండగా కొద్దిసేపటికి అతడి చుట్టూ ఉడుతలు చేరడం కనిపిస్తుంది. అతడు మెల్లిగా వాటికి కుర్కురే తినిపిస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆపై పెద్దసంఖ్యలో ఉడుతలు అక్కడ గుమికూడతాయి.
ఈ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. జంతువులకు కుర్కురే తినిపించడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా మరికొందరు అతడిని ప్రశంసిస్తూ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. ఆకలితో ఉన్న జంతువులకు ఆ వ్యక్తి ఆహారం అందించాడని పలువురు యూజర్లు అతడిని ప్రశంసించారు.