న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన ఒక విమానం వంతెన కింద ఇరుక్కున్నది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఢిల్లీ-గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపున వంతెన కింద ఇరుక్కున రెక్కలు లేని విమానం కనిపించింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో ఎయిర్ ఇండియా వెంటనే దీనిపై స్పందించింది. అలాంటి ప్రమాదం ఏదీ జరుగలేదని తెలిపింది. తాము అమ్మేసిన పాత విమానాన్ని కొన్న వ్యక్తి ట్రాలీలో తరలిస్తుండగా వంతెన కింద స్ట్రక్ అయినట్లు చెప్పింది. ఈ ఘటనతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘సర్వీస్‌లో లేని ఎయిర్ ఇండియా విమానం వంతెన కింద ఇరుక్కుంది. ఇది ఎక్కడ ఎప్పుడు జరిగిందో చెప్పగలరా? పోటీ ఇప్పుడే మొదలైంది’ అంటూ ఒకరు ఫన్నీగా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
#WATCH An @airindiain plane ✈️ (not in service) got stuck under foot over bridge. Can anyone confirm the date and location?
— Ashoke Raj (@Ashoke_Raj) October 3, 2021
The competition starts now👇 pic.twitter.com/pukB0VmsW3