న్యూఢిల్లీ: చైనాతో పోలిస్తే మన పరిస్థితి చాలా బెటర్‌గా ఉందని మేదాంత డైరక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. మన దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ చాలా సక్సెస్‌ఫుల్‌గా సాగిందన్నారు. హై రిస్క్ గ్రూపులో ఉన్న ప్రజలందరూ దాదాపు బూస్టర్ డోసు తీసుకున్నట్లు గులేరియా తెలిపారు. ఎక్కడ కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంకేతాలు లేవని, కానీ మనం మన జాగ్రత్తలో ఉండాలన్నారు. సరైన నిఘా ద్వారా కేసులను పరిశీలించాలని, తొందరగా ఆ కేసుల్ని గుర్తించి, టెస్టింగ్ చేపట్టాలన్నారు. కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందకుండా చూడాలని డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. శీతాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, అలాంటి సమయంలో సరైన రక్షణాత్మక చర్యలు చేపట్టాలన్నారు. హై రిస్క్‌లో ఉండే ప్రజలు తమను తాము రక్షించుకోవాలన్నారు. వాళ్లంతా బూస్టర్ డోసు తీసుకోవాలని డాక్టర్ గులేరియా తెలిపారు.