భోపాల్: జనాన్ని కరుస్తున్న కుక్కను గ్రామస్తులు పట్టుకున్నారు. దానిని మంచానికి కట్టేశారు. పటకారుతో కుక్క పళ్లు పీకేశారు. (Villagers Break Stray Dog’s Teeth) ఆ తర్వాత దానిని వదిలేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు సంరక్షణ సంస్థ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రావత్పురా ఖుర్ద్ గ్రామంలో ఒక వీధి కుక్క పలువురిని కరిచింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహించారు. సోమవారం ఆ కుక్కను పట్టుకుని మంచానికి కట్టేశారు. కర్రలతో దాని నోరు తెరిచారు. పటకారుతో కుక్క పళ్లను విరిచారు.
కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వీధి కుక్క పట్ల క్రూరత్వంగా ప్రవర్తించడంపై జంతు సంరక్షణ సంస్థ ఫిర్యాదు చేసింది. ఆ కుక్కకు చికిత్స అందిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
आवारा कुत्ते को बंधक बनाकर दिखाई क्रूरता देखिए वीडियो#bhind #madhyapradesh #AnimalCruelty pic.twitter.com/xrs5UM4yNI
— BSTV MP-CG (@BSTVdigital) April 16, 2025