Vijay TVK Party | తమిళనాడులో ఘోర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ విజయ్ నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మరణించినట్లుగా తెలుస్తున్నది. ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించినట్లుగా సమాచారం. తమిళనాడులో కరూర్‌లో శనివారం రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఎవరూ ఊహించని విధంగా అభిమానులతో పాటు జనం హాజరయ్యారు. విజయ్ మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట లాంటి పరిస్థితి నెలకొందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, మృతుల్లో ముగ్గురు చిన్నారులు సైతం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కరూర్ మెడికల్ కాలేజీ డీన్ ఆర్ శాంతిమలార్ మాట్లాడుతూ ప్రస్తుతం ముగ్గురు చిన్నారులు సహా పది మంది చనిపోయారని ధ్రువీకరించారు.
Full Speech of Thalaivar @TVKVijayHQ from #Karur 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 #உங்கவிஜய்_நா_வரேன் #TVKVijay pic.twitter.com/XIjUfd6JUf
— Actor Vijay Fans Page (@ActorVijayFP) September 27, 2025
ఇంకా అంబులెన్స్‌లు ఆసుపత్రిని చేరుకుంటున్నాయని.. పూర్తి వివరాలు తెలిపేందుకు సమయం పడుతుందన్నారు. అయితే, తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రహనియన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారని.. మరో 50 మంది వ్యక్తులు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తిరుచ్చి నుంచి 24 మంది వైద్యులు, సేలం నుంచి 20 మంది వైద్యులను కరూర్ ఆసుపత్రిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై, మృతుల వార్తలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహనియన్, కలెక్టర్లను తొక్కిసలాటలో చిక్కుకున్న వారికి తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
🚨Breaking News 🚨
Already 31 dead due to stampede in TVK rally of Vijay. #Karur #TVKVijaypic.twitter.com/65UDmkdTl1
— 👑Che_Krishna🇮🇳💛❤️ (@CheKrishnaCk_) September 27, 2025
యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించాలని తిరుచ్చి మంత్రి అన్బిల్ మహేష్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. త్వరలో సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, తాను ఏడీజీపీతో మాట్లాడానని సీఎం స్టాలిన్ చెప్పారు. ఈ విషయంలో అధికారులకు సహకారం అందించాలని ఆయన కోరారు. ఆదివారం ఆయన కరూర్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నేపథ్యంలో విజయ్ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. అయితే, ర్యాలీలోకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ క్రమంలో ఊపిరాడని పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొన్నారు. మరో వైపు కరూర్ ఆసుపత్రి బాధితులతో నిండిపోయింది. బాధితుల కుటుంబాల ఆర్తనాలదో దద్దరిల్లింది. సోషల్ మీడియాకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. చిత్రాలను చూస్తే పరిస్థితి హృదయవిదారకంగా ఉన్నది.
கரூரில் ம**ண ஓலம்.. விஜய் பிரச்சாரத்தில் 6 குழந்தைகள் உட்பட 31 பேர் பலி.. நொடிக்கு நொடிக்கு உயரும் பலி எண்ணிக்கை.. மருத்துவமனைகளை நோக்கி தொடர்ந்து விரையும் 15-க்கும் மேற்பட்ட ஆம்புலன்ஸ்கள்..#Karur | #TVK | #TVKVijay | #VijayCampaign | #தவெக | #Ambulance | #Hospital |… pic.twitter.com/NmcM5etdJP
— Polimer News (@polimernews) September 27, 2025