Special Category Status | ప్రత్యేక హోదా ఊసెత్తని టీడీపీ : విజయసాయిరెడ్డి
Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ లేవనెత్తడం లేదని, ప్రజా సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Special Category Status : ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ లేవనెత్తడం లేదని, ప్రజా సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
ఏపీలో శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతర హింసలో భాగంగా వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము కోరుతున్నామని చెప్పారు. కాగా, అఖిలపక్ష భేటీలో విపక్షాలు కన్వయర్ యాత్ర వివాదం, నీట్ పేపర్ లీక్, లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి వంటి పలు అంశాలను లేవనెత్తాయి.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ నుంచి జేపీ నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవ్ గగోయ్, ఎస్పీ నేత కే సురేష్ హాజరయ్యారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్, ఎస్పీ ఎంపీ రాం గోపాల్ యాదవ్, ఆప్ సంజయ్ సింగ్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ సహా పలు పార్టీల ప్రతినిధులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు.
ఈ సమావేశంలో కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లు, దుకాణాల యజమానుల పేర్లను ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అంశాన్ని ఎస్పీ, ఆప్ లేవనెత్తాయని సమాచారం. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించాలని, ఈ పదవిని ఖాళీగా ఉంచడం సమంజసం కాదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ సూచించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కేటాయించాలని ఎల్జేపీ, జేడీయూ డిమాండ్ చేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎన్డీయే భాగస్వామ్యపక్షం టీడీపీ డిమాండ్ చేయకపోవడాన్ని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తప్పుపట్టారు.
Read More :
TDP MP | జగన్‌వి డైవర్షన్ పాలిటిక్స్ : టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

