సాధారణంగా టాఫీలు లేదా క్యాండీలు లేదా పిప్పిర్మెంట్ల రుచి విషయానికి వస్తే తియ్యగా ఉంటాయి. అయితే విభిన్న రుచుల కోసం కొన్ని రకాల పిప్పర్మెంట్లలో అసాధారణ అసిడిక్ ఫ్లేవర్స్‌ను కలుపుతుంటారు. దాంతో కలిపిన ఫ్లేవర్‌ను బట్టి కొన్ని తీపి, పులుపు కలబోతగా, మరికొన్ని తియ్యతియ్యగా, ఉప్పుఉప్పుగా, ఇంకొన్ని తియ్యగా ఘాటుగా, తియ్యతియ్యగా, కారంకారంగా ఉంటాయి. భారతదేశంలోని చిరుతిళ్లలో ఈ అన్నిరకాల పిప్పర్‌మెంట్లకు ప్రముఖ స్థానం ఉన్నది. కానీ, ఇప్పుడు ఘాటుగా ఉండే పల్స్ కంపెనీ పిప్పర్మెంట్ పేరు మారుమోగుతున్నది.
ఎందుకంటే, భారత్‌లో పిప్పర్మెంట్ల ప్రాముఖ్యతను తెలుసుకున్న హ్యోజియోంగ్ పార్క్ అనే కొరియన్ యువతి.. ఘాటుతీపి రుచుల కలయికగా ఉండే పల్స్ కంపెనీ పిప్పర్మెంట్ కొని కొరికిచూసింది. అంతే ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. ఘాటును భరించలేక కీస్మని అరిచింది. నాలుక మంట ఓర్చుకోలేక ఏడ్చినంత పనిచేసింది.
వీడియో బ్లాగర్ కూడా అయిన కొరియన్ యువతి ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘ఇండియన్ క్యాండీ నన్ను ఏడిపించింది. దాని గురించి నాకు ఎవరు రికమెండ్ చేశారు..?’ అని ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యూస్, లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. కింది వీడియోలో ఆ కొరియన్ యువతి ఎక్స్ప్రెషన్స్ చూసి మీరూ నవ్వుకుంటారా..