న్యూఢిల్లీ : ఊయలలో చిన్నారితో తల్లి పడుకుని ఉండగా తమ వెనుకకు పాము రావడం వారు గమనించలేదు. ఊయల నుంచి కిందకు దిగిన తల్లి కొద్దిసేపటికి అక్కడకు వచ్చిన స్నేక్‌ను చూడటంతో ఒక్క ఉదుటున బేబీని తీసుకుని పరుగుపెట్టారు. స్నేక్ వీడియోస్ అనే అకౌంట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా 2.2 కోట్ల మంది వీక్షించారు.
ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ తన చిన్నారితో కలిసి ఊయలలో ఉండగా డోర్లో నుంచి పాము అక్కడకి వచ్చి వారి వెనుకగా ఉంటుంది. ఈ విషయం తెలియని వారు ఊయలలోనే ఉంటారు. కొద్దిసేపటికి మహిళ కిందకు దిగి కూర్చుని ఉండగా తమకు కొద్ది సెంటీమీటర్ల దూరంలోనే పాము ఉండటం గమనించి బేబీని తీసుకుని రూం నుంచి బయటకు పరిగెత్తడం ఈ వీడియోలో కనిపిస్తుంది. తాము ఈ వీడియోలో ముందు పామును చూడలేదని, బేబీని గమనిస్తుండటంతో అక్కడకు వచ్చిన స్నేక్పై తాము దృష్టిసారించలేదని పలువురు యూజర్లు కామెంట్ చేయగా మరికొందరు టెర్రిఫిక్ వీడియో అంటూ రాసుకొచ్చారు.