న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయమకమిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. చక్కటి వాగ్ధాటి, సుపరిపాలనతో ప్రజల గుండెల్లోతనదైన ముద్రవేసుకున్నారని ట్వీట్ చేశారు.
‘భారతరత్న, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. రాజనీతిజ్ఞుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, మేధావి, చక్కటి వాగ్ధాటితోపాటు సుపరిపాలనతో ప్రజల గుండెల్లోతనదైన ముద్రవేసుకున్న వాజ్పేయి గారి జీవితం స్ఫూర్తిదాయకం’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య తన టిట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
భారతరత్న, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. రాజనీతిజ్ఞుడు, ఉత్తమ పార్లమెంటేరియన్, మేధావి, చక్కటి వాగ్ధాటితోపాటు సుపరిపాలనతో ప్రజల గుండెల్లోతనదైన ముద్రవేసుకున్న వాజ్పేయి గారి జీవితం స్ఫూర్తిదాయకం. pic.twitter.com/9jz4gt7nGh
— Vice President of India (@VPSecretariat) August 16, 2021