Vijay Kumar Malhotra | భారతీయ జనతాపార్టీ సీనియర్ లీడర్ (Veteran BJP leader), మాజీ ఎంపీ విజయ్ కుమార్ మల్హోత్ర (Vijay Kumar Malhotra) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 94 ఏండ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు బీజేపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ కుమార్ మల్హోత్ర.. ఐదుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఢిల్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాదు రెండుసార్లు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మల్హోత్ర మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం మల్హోత్ర చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
ਸ਼੍ਰੀ ਵਿਜੈ ਕੁਮਾਰ ਮਲਹੋਤਰਾ ਜੀ ਇੱਕ ਸ਼ਾਨਦਾਰ ਨੇਤਾ ਸਨ ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਜਨਤਕ ਮੁੱਦਿਆਂ ਦੀ ਡੂੰਘੀ ਸਮਝ ਸੀ। ਉਨ੍ਹਾਂ ਨੇ ਦਿੱਲੀ ਵਿੱਚ ਸਾਡੀ ਪਾਰਟੀ ਨੂੰ ਮਜ਼ਬੂਤ ਕਰਨ ਵਿੱਚ ਮੁੱਖ ਭੂਮਿਕਾ ਨਿਭਾਈ। ਉਨ੍ਹਾਂ ਨੂੰ ਸੰਸਦੀ ਮਾਮਲਿਆਂ ਵਿੱਚ ਉਨ੍ਹਾਂ ਦੇ ਦਖਲਅੰਦਾਜ਼ੀ ਲਈ ਵੀ ਯਾਦ ਕੀਤਾ ਜਾਂਦਾ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਦੇਹਾਂਤ ਬਹੁਤ ਦੁਖਦਾਈ ਹੈ। ਉਨ੍ਹਾਂ… pic.twitter.com/UmcpVDsDNS
— Narendra Modi (@narendramodi) September 30, 2025
Also Read..
Bihar Poll Schedule | వారం రోజుల్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!
Donald Trump | ట్రంప్ మరో టారిఫ్ బాంబ్.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత