Varun Gandhi | ఉద్యోగాలిమ్మంటే లాఠీలు ఝుళిపిస్తారా.. యోగీపై వరుణ్‌గాంధీ విమర్శలు
Varun Gandhi | ఉద్యోగాలు కల్పించాలని అడిగితే పోలీసులతో లాఠీలు ఝుళిపిస్తారా? అని యోగి సర్కార్‌కు వరుణ్‌గాంధీ ప్రశ్నించారు.

Varun Gandhi | బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోమారు సొంత పార్టీపై విమర్శలకు దిగారు. ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించడం ఏమిటని ట్వీట్ చేశారు. ప్రభుత్వశాఖల్లో ఒకవేళ ఖాళీలు ఉంటే, నియామకాలు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగినప్పటి నుంచి సొంత పార్టీపైనే వరుణ్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న నిరసనకారులను పోలీసులు వెంటాడి లాఠీలు ఝుళిపించిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ఆందోళనకారులంతా భారతీయులేనని, వారి విజ్ఞప్తులను వినేందుకు కూడా ఏ ఒక్కరూ లేరని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నిరసన ప్రదర్శనల్లో అధికారుల పిల్లలు ఉంటే ఇలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. తాజా వరుణ్‌గాంధీ ట్వీట్‌తో పార్టీ విధానాన్ని పాటించేందుకు సిద్ధంగా లేరని అర్థం అవుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

