ముంబై: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలులో ప్రయాణించిన వ్యక్తి టాయిలెట్లో స్మోక్ చేశాడు. దీంతో ఫైర్ అలారం మోగింది. మంటలు ఆర్పే పరికరం యాక్టివేట్ కావడంతో వేగంగా వెళ్తున్న ఆ రైలు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ సంఘటన నేపథ్యంలో ఆ వ్యక్తిని తర్వాత స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుంచి దించివేశారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ముంబై-జల్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్తున్నది. అయితే ఒక వ్యక్తి టాయిలెట్లో సిగరెట్ తాగాడు. ఆ పొగ వల్ల ఫైర్ అలారం మోగింది. ఆ వెంటనే ఆటోమేటిక్‌గా మంటలు ఆర్పే పరికరం యాక్టివేట్ అయ్యింది. దీంతో వేగంగా వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళన చెందారు.
కాగా, ఒక కోచ్‌లోని టాయిలెట్లో వ్యక్తి స్మోక్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు రైల్వే టీసీ, పోలీసులు గుర్తించారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాసిక్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆ వ్యక్తిని దించివేశారు.