మధ్యప్రదేశ్‌లో మరో నిర్లక్ష్యం… ఒక్క సిరంజితో 30 మంది విద్యార్థులకు కరోనా టీకాలు
భోపాల్: బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో మరో నిర్లక్ష్యం బయటపడింది. ఒక్క సిరంజితోనే 30 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాగర్ నగరంలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్లో బుధవారం కరోనా టీకా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులకు టీకాలు వేశారు.
కాగా, వ్యాక్సిన్ వేసే జితేంద్ర కరోనా నిబంధనలు ఉల్లంఘించాడు. ఒక్కో విద్యార్థికి టీకా కోసం ఒక్కో సిరంజి వినియోగించాల్సి ఉంది. అయితే జితేంద్ర కేవలం ఒక్క సిరంజితో స్కూలుకు వచ్చాడు. ఆ ఒక్క సిరంజితోనే సుమారు 30 మంది విద్యార్థులకు కరోనా టీకాలు వేశాడు. ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. జితేంద్రను దీనిపై నిలదీశారు. అయితే అధికారులు తనకు కేవలం ఒక్క సిరంజి మాత్రమే ఇచ్చారని జితేంద్ర తెలిపాడు. ఇందులో నా తప్పు ఏముంది అని ఎదురు ప్రశ్నించాడు.
మరోవైపు ఈ సంఘటనపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ క్షితిజ్ సింఘాల్ స్పందించారు. స్కూల్లోని వ్యాక్సినేషన్ శిబిరాన్ని వెంటనే తనిఖీ చేయాలని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌ను ఆదేశించారు. అయితే అధికారులు చేరుకునేలోపు జితేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంచాడు. దీంతో అధికారుల ఫిర్యాదుతో పోలీసులు జితేంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ రాకేష్ రోషన్‌పై కూడా శాఖాపరమైన దర్యాప్తు, చర్యలకు ఆదేశించారు.
Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX
— Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

