సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి!
మొగుడు-పెళ్లాం పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి తేల్చాల్సిన పరిస్థితికి దారితీసింది. తన భర్త, ఉత్తర్ ప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు పప్పూ గిర్ధారీ తనను వేధిస్తున్నాడని, తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ క్రీడల శాఖ మంత్రి రేఖా ఆర్య గురువారం వీడియో, ఆడియో క్లిప్లు విడుదల చేశారు. మరుసటి రోజే గిర్ధారీ స్పందిస్తూ తన భార్య అవినీతి ద్వారా రూ.210 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టిందని ఆరోపించారు.
- ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: మొగుడు-పెళ్లాం పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి తేల్చాల్సిన పరిస్థితికి దారితీసింది. తన భర్త, ఉత్తర్ ప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు పప్పూ గిర్ధారీ తనను వేధిస్తున్నాడని, తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ క్రీడల శాఖ మంత్రి రేఖా ఆర్య గురువారం వీడియో, ఆడియో క్లిప్లు విడుదల చేశారు. మరుసటి రోజే గిర్ధారీ స్పందిస్తూ తన భార్య అవినీతి ద్వారా రూ.210 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టిందని ఆరోపించారు. తన భార్య నిర్వహిస్తున్న శాఖలో భారీ అవినీతి జరిగిందని, దీనిపైన, ఆమె ఆస్తులపైన దర్యాప్తు జరిపించాలని ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని అర్థించారు.
తన ఆరోపణలు తప్పని తేలితే ఎటువంటి శిక్షకైనా తాను సిద్ధమేనని కూడా ఆయన సవాలు చేశారు. నేను నిన్ను హింసించానని గోలు దేవత(ఉత్తరాఖండ్ ప్రజల ఆరాధ్య దేవత)పైన ప్రమాణం చేసి చెప్పగలవా? అంటూ తన భార్యకు సవాలు విసిరారు. అంతకుముందు మంత్రి రేఖ ఆర్య తన భర్తపైన డెహ్రాడూన్లోని కంటోన్మెంట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిర్ధారీ తనను కొట్టాడని, వేధించాడని, కులం పేరుతో దూషించాడని, చంపుతానని బెదిరించాడని మంత్రి ఫిర్యాదు చేశారు. తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ ఒక ఆడియో రికార్డింగ్ని ఆమె విడుదల చేశారు. ఫేస్బుక్లో పెట్టిన ఒక వీడియోలో తన పిల్లల భద్రత కోసమే తాను తన భర్తపైన ఫిర్యాదు చేశానని వివరణ ఇచ్చారు. పప్పూ గిర్ధారీగా పేరుపొందిన గిర్ధారీ లాల్ సాహు బరేలీలో బీజేపీ సంస్థాగత వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. 2004లో ఆయనకు రేఖ ఆర్యతో వివాహమైంది. గిర్ధారీతో వివాహం తర్వాతనే ఆమె రాజకీయ జీవితం ప్రారంభమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

