కరోనా ఎఫెక్ట్: వచ్చేనెల 2 వరకు హైకోర్టు బంద్
హైకోర్టు| కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం మూతపడింది. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు మూసి ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. మే 3 మూడు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటామని వెల్లడించింది.

డెహ్రాడూన్: కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ఉన్నత న్యాయస్థానం మూతపడింది. నేటి నుంచి వచ్చే నెల 2 వరకు మూసి ఉంటుందని హైకోర్టు ప్రకటించింది. మే 3 మూడు నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటామని వెల్లడించింది. కాగా, డెహ్రాడూన్, పౌరీ గగర్హ్వాల్ జిల్లాలో గత కొన్నిరోజులుగా భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. దీంతో డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలతోపాటు, పౌరీ గర్హ్వాల్ జిల్లాలోని కొట్ద్వార్, స్వర్గ్ ఆశ్రమ్ ప్రాంతాల్లో నేటి నుంచి కర్ఫ్యూ అమలుచేస్తున్నది. ఇది వారంరోజులపాటు అంటే మే 3 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం నమోదవుతున్న కేసుల్లో 33.69 శాతం ఈ జిల్లాలోనే ఉంటున్నాయి. ఉత్తరాఖండ్‌లో 35,864 కేసులు యాక్టివ్‌గా ఉండగా అందులో 12,084 డెహ్రాడూన్‌కు చెందినవే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
విజయనగరంలో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి
కేంద్రం సేకరించే వ్యాక్సిలన్నీ రాష్ట్రాలకే : కేంద్రమంత్రి హర్షవర్ధన్
కొవిడ్‌తో పండిట్ రాజన్ మిశ్రా కన్నుమూత
కొవిడ్‌పై పోరులో భారత్‌కు యూఏఈ సంఘీభావం
ఏప్రిల్ – మే మధ్య 330 అదనపు రైళ్లు : రైల్వేబోర్డు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

