గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 15:51:12

జూలై ఒకటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర.. వారికే అనుమతి

జూలై ఒకటి నుంచి చార్‌ధామ్‌ యాత్ర.. వారికే అనుమతి

డెహ్రాడూన్‌ : జూలై ఒకటి నుంచి చార్‌ధామ్‌ యాత్రను ప్రారంభించనున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రం నుంచి వచ్చే యాత్రికులను మాత్రమే పుణ్యక్షేత్రాల సందర్శనకు అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. చార్‌ధామ్‌ దేవస్థానం బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రవినాథ్‌ మాట్లాడుతూ జూలై ఒకటిన యాత్ర ప్రారంభమవుతుందని, యాత్రికులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. పుణ్యక్షేత్రాల్లో సందర్శించాలనుకునే వారు స్వయంగా పేర్లు రిజిష్టర్‌ చేసుకోవాలని, తర్వాత స్థానిక పరిపాలన అధికారులు వారికి అనుమతి మంజూరు చేస్తుందని చెప్పారు.

కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి, రాష్ట్రం వెలుపలి వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. కేదార్‌నాథ్‌లో 800 మంది, బద్రీనాథ్‌లో 1200, గంగోత్రికి 600, యమునోత్రికి 400 మంది చొప్పున భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా, చార్‌ధామ్‌ యాత్రకు ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. కరోనా వైరస్‌ సంక్రమణ క్రమంలో భక్తుల ప్రవేశంపై జూన్‌ ౩౦ వరకు నిషేధం విధించారు. ముఖ్యంగా చార్‌ధామ్‌ తీర్థ్‌ పురోహితులు అభ్యంతరం వ్యక్తం చేశారు.


logo