విషాదం: బైక్‌తో సహా కాలువలో కొట్టుకుపోయిన వ్యక్తి..!
Biker swept away: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కురవడంతో వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువ దాటబోయి ఓ బైకర్ బైక్‌తో సహా కొట్టుకుపోయాడు.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కురవడంతో వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువ దాటబోయి ఓ బైకర్ బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. చమోలీ జిల్లాలోని థరాలీ, గ్వాలాడామ్ మధ్య సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలువలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఓ వ్యక్తి ఆ కాలువను దాటేందుకు ప్రయత్నించాడని, కాలువ మధ్యలోకి వెళ్లిన తర్వాత బైక్ జారీపోవడంతో బైక్‌తో సహా కొట్టుకుపోయాడని పోలీసులు తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న వెంటనే గల్లంతైన వ్యక్తి కోసం గాలించామని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దిగువన బైకు చెట్లకు చిక్కుకుని ఆగిపోయిందని, గల్లంతైన వ్యక్తి జాడ మాత్రం తెలియరాలేదని తెలిపారు. అయితే, గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. గల్లంతైన వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

