UP Police | బదౌన్, ఏప్రిల్ 12: ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి విసిరి హత్య చేసిన ఓ వ్యక్తిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు 30 పేజీల చార్జిషీట్ వేశారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఈ విచిత్రమైన ఘటనపై వికేంద్ర శర్మ అనే జంతు హక్కుల కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మనోజ్కుమార్పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 429తో పాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎలుకకు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఈ కేసులో దోషిగా తేలితే జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని, ఐపీసీ సెక్షన్ 429 కింద ఐదేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు పడే చాన్స్ ఉన్నదని సీనియర్ న్యాయవాది ఒకరు తెలిపారు.