సోన్‌భద్ర: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి స్థానిక కోర్టు ఇవాళ 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అత్యాచారం చేసిన తర్వాత ఆ బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చినట్లు నిందితునిపై ఆరోపణలు ఉన్నాయి. సోన్‌భద్రకు చెందిన అదనపు సెషన్స్ జడ్జి, పోక్సో స్పెషల్ జడ్జి అమిత్ వీర్ సింగ్ ఈ తీర్పును ఇచ్చారు. నిందితుడి రమేశ్‌పై 50 వేల జరిమానా కూడా విధించాడు. 2021లో జుగేల్ ఏరియా నుంచి అమ్మాయిని తీసుకెళ్లిన నిందితుడు ఆమె పెళ్లి చేస్తానని తండ్రికి హామీ ఇచ్చినట్లు గవర్నమెంట్ లాయర్ దినేశ్ ప్రసాద్ అగ్రహరి కోర్టుకు తెలిపారు. బాధిత బాలిక తండ్రికి అయిదుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే చిన్న అమ్మాయిని ఆ వ్యక్తి తండ్రికి అప్పగించాడన్నారు. నిందితుడు రమేశ్ ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత .. అబార్షన్ మందులు ఇచ్చినట్లు ప్రాసిక్యూషన్ తన వాదనల్లో పేర్కొన్నది. ఒకవేళ ఈ విషయాన్ని బయటకు చెబితే, చంపేస్తానని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఆ అమ్మాయిని చిన్నాన ఇంట్లో విడిచి వెళ్లిన తర్వాత నిందితుడి దుశ్చర్యలు బయటకు వచ్చాయి. అమ్మాయి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021, మార్చి 17వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసులు వాదోపవాదాలు విన్న తర్వాత.. నిందితుడు రమేశ్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష, ఫైన్ విధించారు.