లక్నో, నవంబర్ 18: హలాల్ సర్టిఫికేషన్‌తో అమ్మే అన్ని ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇక నుంచి హలాల్ సర్టిఫికేషన్‌తో ఉన్న ఆహార ఉత్పత్తుల అమ్మకం, తయారీ, నిల్వ, పంపిణీ లపై నిషేధం విధిస్తున్నామని, ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది.
అయితే ఎగుమతుల కోసం తయారు చేసే ఉత్పత్తులకు మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ విధంగా చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాక సమాజంలో విభజన, ద్వేషాలను వ్యాపిస్తూ ప్రభుత్వాన్ని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.