CM Yogi Adityanath: మహాకుంభ్ సక్సెస్.. పారిశుద్ధ కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం.. వర్కర్లకు 10వేల బోనస్
CM Yogi Adityanath: త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత శానిటేషన్ కార్మికులతో కలిసి లంచ్ చేశారు. వాళ్లకు పదివేల బోనస్ ప్రకటించారు.
ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభ్ .. మహాశివరాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath).. త్రివేణి సంగమంలోని అరైల్ ఘట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోటులో ప్రయాణం చేసి .. గంగా హారతిలో పాల్గొన్నారు. యూపీ క్యాబినెట్ ఆ ఈవెంట్లో పాల్గొన్నది. డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్, కేపీ మౌర్య, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం చేశారు. లంచ్‌లో మంత్రులు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.
సీఎం యోగి మాట్లాడుతూ.. మహాకుంభ్‌లో పాల్గొన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లకు పది వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం 16వేలు అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. తాత్కాలిక హెల్త్ వర్కర్లకు.. నేరుగా నగదును బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు తెలిపారు. ఆ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు చెప్పారు.
మహాకుంభలో సుమారు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
#WATCH | Prayagraj: Uttar Pradesh CM Yogi Adityanath says “Our government has decided to provide Rs 10,000 bonus to the sanitation and health workers at the Maha Kumbh in Prayagraj. We are going to ensure that from April, a minimum wage of Rs 16,000 will be provided to the… pic.twitter.com/QwywAUsD2S
— ANI (@ANI) February 27, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

