Car into river | ఇంట్లో గొడవపడి భార్యతో కలిసి కోపంగా బయటికి.. నదిలోకి దూసుకెళ్లిన కారు, దంపతులిద్దరూ దుర్మరణం
Car into river | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో గొడపడి కోపంగా బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కారుతో సహా నదిలోకి దూసుకెళ్లాడు. నీళ్లలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అతని భార్య గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
అమ్రోహ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో గొడపడి కోపంగా బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కారుతో సహా నదిలోకి దూసుకెళ్లాడు. నీళ్లలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో అతని భార్య గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. అమ్రోహ జిల్లాకు చెందిన షాన్ ఎ ఆలమ్ శుక్రవారం సాయంత్రం తన తండ్రితోపాటు ఇతర కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. గొడవ అనంతరం తన భార్యను తీసుకుని ఇంటి నుంచి ఆవేశంగా కారులో బయలుదేరాడు. తన తండ్రి, సోదరి కారుకు అడ్డం రావడంతో వారిని ఢీకొట్టి మరీ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆలమ్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తండ్రిని ఢీకొట్టిన అనంతరం ఆదే ఆవేశంలో కారు నడిపిన షాన ఎ ఆలమ్.. భార్యతో సహా రోడ్డు వెంట ఉన్న నదిలో దూసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సెర్చింగ్ కోసం రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. శనివారం ఉదయం షాన్ ఎ ఆలమ్ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన అతని భార్య మృతదేహం కోసం సెర్చింగ్ కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

