న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు(US Vice President) జేవీ వాన్స్.. ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా భారత్లో టూర్ చేయనున్నారు. ఈ నెల చివరలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యక్షుడి హోదాలో జేడీ వాన్స్.. రెండో విదేశీ పర్యటన చేపట్టనున్నారు. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో తొలి పర్యటన చేశారు.
అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ పేరెంట్స్ భారతీయులు. తెలుగువారైన క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరిలు.. 1970లో అమెరికాకు వలసవెళ్లారు. సెకండ్ లేడీ హోదాలో.. ఉషా వాన్స్ తొలిసారి తన పేరెంట్స్ దేశానికి రానున్నారు.
యేల్ న్యాయ పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో ఉషా, జేడీ కలుసుకున్నారు. లిటిగేటర్గా ఉషా పనిచేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్ దగ్గర ఆమె క్లర్క్ గా చేశారు. కొలంబియా కోర్టు జడ్జి బ్రెట్ కవనాగ్ వద్ద కూడా ఆమె పనిచేశారు. యేల్ యూనివర్సిటీ నుంచి ఆమె బ్యాచిలర్స్ పట్టా పొందారు. క్యాంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు.