న్యూఢిల్లీ: చదువుకోవడానికి తప్ప తరగతులను అడ్డుకుని క్యాంపస్లను ధ్వంసం చేసేందుకు తాము అమెరికా రావడం లేదని స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న విదేశీ విద్యార్థులు అర్థం చేసుకోవాలని అమెరికా విదేశాంగ అధికారి ఒకరు బుధవారం హెచ్చరించారు.
తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత స్టూడెంట్ వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ మాట్లాడుతూ.. అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకునే అన్ని వీసా సంబంధిత నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. తమ స్టూడెంట్ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, విద్యార్థులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని ఆమె చెప్పారు. విద్యార్థులు తాము అమెరికాకు వచ్చేది చదువుకోవడానికి మాత్రమేనని, తరగతులను అడ్డుకుని, క్యాంపస్లను ధ్వంసం చేయడానికి కాదని అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు.