దావోస్, జనవరి 18: బోయింగ్ విమానం మళ్లీ మొరాయించింది. బోయింగ్ 737లో సాంకేతిక సమస్య తలెత్తడంతో బుధవారం అమెరికా రక్షణ మంత్రి అంథోని బ్లింకెన్ చాలాసేపు అందులో చిక్కుకుపోయారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న అనంతరం జ్యూరిచ్ నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణమైనప్పుడు ఈ ఘటన జరిగింది.
ఆ తర్వాత మరో విమానంలో బ్లింకెన్ వాషింగ్టన్ వెళ్లిపోయారు. ఇటీవల బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో తరచూ సమస్యలు తలెత్తడం గమనార్హం. కొద్ది రోజుల కిందట గగనతలంలో విమానం డోర్ ఊడిపోయిన ఘటన భయాందోళనలు రేపిన విషయం తెలిసిందే.