న్యూఢిలీ : ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త అదానీలపై లక్షిత దాడుల ద్వారా భారత్‌ను అస్థిర పరిచే ప్రయత్నాల వెనుక అమెరికా విదేశాంగ శాఖ నిధులు సమకూర్చిన సంస్థలు, డీప్స్టేట్లు ఉన్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలను అమెరికా శనివారం ఖండించింది.
భారత్ చేసిన వ్యాఖ్యలు తమను నిరాశ పరిచాయని, మీడియాకు స్వేచ్ఛ ఇవ్వడంలో ప్రపంచంలోనే అమెరికా చాంపియన్ అని అమెరికా దౌత్యకార్యాలయ ప్రతినిధి మీడియాకు తెలిపారు. తమపై భారత్ ఇలాంటి ఆరోపణలు చేయడం నిరాశ పరిచిందని, భారత్ వ్యతిరేక ఎజెండా ఏదీ తమ వద్ద లేదని పేర్కొన్నారు.