Divorce | భర్త కుర్కురే తీసుకురాలేదని విడాకులకు దరఖాస్తు పెట్టిన భార్య..!
Divorce | ఇటీవలి కాలంలో విడాకులు ఎంతగా అపహాస్యం అవుతున్నాయో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. భర్త తన కోసం కుర్కురే ప్యాకెట్ తీసుకురాలేదన్న కారణంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది.
ఆగ్రా: ఇటీవలి కాలంలో విడాకులు ఎంతగా అపహాస్యం అవుతున్నాయో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. భర్త తన కోసం కుర్కురే ప్యాకెట్ తీసుకురాలేదన్న కారణంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన. ఆమెకు ప్రతి రోజూ కుర్కురేను చిరుతిండిగా తినడం అలవాటు. భర్త రోజూ రూ. 5 కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చి ఆమెను సంతోషపెట్టేవాడు. ఒక రోజు ఉత్త చేతులతో ఇంటికొచ్చిన భర్తను చూసిన భార్య వెంటనే పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇప్పించాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి చిన్న కారణాలతో విడాకులు కోరుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతున్నది. పెళ్లయి 18 నెలలు అయినా భర్త తనతో గొడవపడడం లేదని, అతడి నుంచి తనకు విడాకులు ఇప్పించాలని యూపీ మహిళ అప్పట్లో కోర్టుకెక్కడం సంచలనమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

