దూరదర్శన్, ఆకాశవాణిలో యూపీ ఎన్నికల ప్రచారం… రాజకీయ పార్టీలకు 1,798 నిమిషాల సమయం

లక్నో: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలతోపాటు దేశ రాజకీయాల్లో మార్పునకు దారి తీసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలపై దూరదర్శన్, ఆకాశవాణిలో రాజకీయ పార్టీల ప్రచారం కోసం మొత్తం 1,798 నిమిషాలు కేటాయించారు. రాజకీయ పార్టీలకు ప్రసార సమయం నిర్ణయించేందుకు శుక్రవారం డ్రా తీసినట్లు యూపీ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ బ్రహ్మ్ దేవ్ రామ్ తివారీ తెలిపారు.
దూరదర్శన్, ఆకాశవాణిలో ఎన్నికల ప్రచార ప్రసారానికి సంబంధించి బీజేపీకి 478, బీఎస్పీకి 307, ఎస్పీకి 303, కాంగ్రెస్కు 151, ఆర్ ఎల్డీకి 107, సీపీఐకి 92, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీ, ఎన్పీపీకి 90 నిమిషాల చొప్పున సమయం కేటాయించినట్లు బ్రహ్మ్ దేవ్ రామ్ తివారీ వెల్లడించారు. మొత్తం 7 దశలను కవర్ చేస్తూ ఫిబ్రవరి 5 నుండి మార్చి 5 వరకు మొత్తం 16 రోజులు మధ్యాహ్నం 1-3 మధ్య దూరదర్శన్లో ప్రసారం జరుగుతుందని వివరించారు.
అదేవిధంగా ఆకాశవాణిలో 14 రోజులపాటు ప్రసారం జరుగుతుందని తివారీ తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 10 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి 7:10 వరకు రెండు షిఫ్టులలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రసారాలు ఉంటాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు కలిపి దూరదర్శన్, రేడియోలో ఎన్నికల ప్రచార ప్రసారాలకు మొత్తం 1,798 నిమిషాలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

