UP Officer Removed | శ్మశాన వాటిక కోసం అభ్యర్థించిన వ్యక్తికి శిక్ష.. ఆ అధికారి తొలగింపు
UP Officer Removed | తమ గ్రామానికి శ్మశాన వాటిక కోసం భూమి కేటాయించాలని అభ్యర్థించిన వ్యక్తికి ఒక అధికారి శిక్ష విధించాడు. కోడిలా వంగి ఉండాలని ఆదేశించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిని ఆ పోస్ట్ నుంచి తొలగించారు.
లక్నో: తమ గ్రామానికి శ్మశాన వాటిక కోసం భూమి కేటాయించాలని అభ్యర్థించిన వ్యక్తికి ఒక అధికారి శిక్ష విధించాడు. కోడిలా వంగి ఉండాలని ఆదేశించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ అధికారిని ఆ పోస్ట్ నుంచి తొలగించారు. (UP Officer Removed) ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మందన్పూర్ గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీర్గంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఉదిత్ పవార్‌ను ఆరుగురు గ్రామస్తులు మూడోసారి కలిశారు. అయితే పదే పదే ఎందుకు వస్తున్నారని వారిపై ఆయన మండిపడ్డాడు. ఒక వ్యక్తి ఇచ్చిన అభ్యర్థన లేఖను అతడి ముఖంపై విసిరికొట్టాడు. కోడిలా వంగి ఉండాలంటూ ఆ వ్యక్తికి శిక్ష విధించాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శివకాంత్ ద్వివేది ఈ సంఘటనపై స్పందించి విచారణ జరిపారు. అధికారి ఉదిత్ పవార్ గ్రామస్తుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతోపాటు అకారణంగా ఒక వ్యక్తిని శిక్షించినట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదిత్ పవార్‌ను ఆ పోస్ట్ నుంచి తొలగించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, కార్యాలయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి కోడి మాదిరిగా వంగి ఉన్నాడని, ఎవరో దీనిని వీడియో తీశారని ఉదిత్ పవార్ తెలిపాడు.
In UP's Bareilly, a complainant could be seen kneeling down in front of SDM Udit Pawar. pic.twitter.com/RAIQD3Hfss
— Piyush Rai (@Benarasiyaa) September 15, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

