లక్నో: మంత్రి ప్రసంగం ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గం ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల సూచనతో ఆ మంత్రి బలవంతంగా గ్రామం విడిచి వెళ్లాల్సి వచ్చింది. (Minister Forced To Exit) ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిథాల్పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల దీపు నిషాద్ జూన్ 14న అదృశ్యమయ్యాడు. ఆ మరునాడు అతడి మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, నిషాద్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి సంజయ్ నిషాద్ వందలాది మద్దతుదారులతో కలిసి శనివారం ఆ గ్రామాన్ని సందర్శించారు. మృతుడి తల్లి రమావతి దేవిని ఆయన పరామర్శించారు. ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. మంత్రి ప్రసంగంతో రెచ్చిపోయిన నిషాద్ పార్టీ సభ్యులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న గ్రామ పెద్ద, ఆయన సోదరుల ఇళ్లలో ఫర్నిచర్, బైక్ను ధ్వంసం చేశారు.
మరోవైపు గ్రామ పెద్ద ఇంటిపై దాడి చేయడంపై గ్రామస్తులు, ఆయన మద్దతుదారులు ఆగ్రహించారు. మంత్రి సంజయ్ నిషాద్ ఉన్న చోటుకు వందల సంఖ్యలో వారు చేరుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామం నుంచి వెళ్లాలని మంత్రికి ఎస్పీ సూచించారు. దీంతో సంజయ్ నిషాద్ అక్కడి నుంచి వెళ్లడంతో గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
निषाद परिवार को न्याय दिलवाया जाएगा…
जनपद देवरिया में निषाद पार्टी के कद्दावर कार्यकर्ता स्व० दीपू निषाद की हत्या पर बिट्ठलपुर ग्रामसभा रुद्रपुर देवरिया स्तिथ आवास पर पोलिटिकल गाॅडफादर आफ फिशरमैन निषाद राज वंशज डॉ संजय कुमार निषाद राष्ट्रीय अध्यक्ष निषाद पार्टी पहुँचकर पीड़ित… pic.twitter.com/a3HbRooBO8
— Dr. Sanjay Kumar Nishad (@mahamana4u) June 22, 2024