ప్రియురాలి ఇంటిపై ప్రియుడి మృతదేహం..!
Dead body on Terrace: ప్రియురాలి ఇంటి పైకప్పుపై ఆమె ప్రియుడి మృతదేహం పడివుంది.

బందా: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాందా జిల్లాలో ఓ విషాదకర ఘటన వెలుగుచూసింది. ప్రియురాలి ఇంటి పైకప్పుపై ఆమె ప్రియుడి మృతదేహం పడివుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. మెడపైన గాయాలతో ఇంటి టెర్రస్‌పై పడివున్న మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. బాందా జిల్లాలోని అంబేద్కర్ నగర్‌కు చెందని కార్తీక్ సోని (25) అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో.. తన కూతురు జోలికి రావద్దని కార్తీక్ సోనిని హెచ్చరించాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ప్రియురాలి ఇంటికి వెళ్లిన కార్తీక్ సోని.. ఆమె తండ్రితో గొడవకు దిగాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ తెల్లవారే సరికి కార్తీక్ సోని మృతదేహం యువతి ఇంటి టెర్రస్‌పై ప్రత్యక్షమైంది. మెడపై తీవ్ర గాయాలున్నాయి. స్థానికులు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడంవల్లే కార్తీక్ మృతిచెందినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

