లక్నో, జూన్ 27: ఉత్తరప్రదేశ్లోని మీరట్ డివిజనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి సెల్వా కుమారికి చెందిన పెంపుడు కుక్క ఆచూకీ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. కేవలం 36 గంటల వ్యవధిలో 500లకుపైగా ఇండ్లను తనిఖీ చేశారు. శునకం తప్పిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం నుంచి సోమవారం వరకు ప్రతి ఇంటిని జల్లెడపట్టారు. దీంతో శునకం గురించి సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఓ వ్యక్తి కుక్కను గుర్తించి తీసుకొచ్చి కమిషనర్ ఇంట్లో అప్పగించాడు. సమాచారం తెలిసిన పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.