లక్నో: మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా లేదా తప్పుడు వివరాలతో ప్రచురించే, ప్రసారం చేసే కథనాలపై సదరు మీడియా సంస్థ మేనేజర్ నుంచి వివరణ కోరాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సీఎం యోగి అదిత్యనాథ్ ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ ఈ నెల 16న ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వ విధానాలు, తీసుకొంటున్న చర్యలపై వచ్చే వ్యతిరేక వార్తలపై చర్యల పేరుతో మీడియా సంస్థలను వేధింపులకు గురిచేసేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ‘వ్యతిరేక’ వార్తా కథనాలను ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్(ఐజీఆర్ఎస్)లో నమోదు చేస్తామని, తర్వాత వాటిని సంబంధిత డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులకు పంపుతామని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను సమాచార శాఖ క్రోడీకరిస్తుందని అందులో తెలిపారు.