లక్నో: చట్ట విరుద్ధ మతమార్పిడి (సవరణ బిల్లు) 2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. గతంలో ఈ చట్టం కింద గరిష్ఠంగా పదేండ్ల శిక్ష, రూ.50 వేల జరిమానా ఉండేది. ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా, మత మార్పిడి ఉద్దేశంతో మహిళ, మైనర్‌ను అక్రమ రవాణా చేసినా ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.