Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
Piyush Goyal : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత పీయూష్ గోయల్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పని చేసిన సీఈసీలకు కాంగ్రెస్ లంచాలు ఇచ్చిందన్నారు.
Piyush Goyal : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అంటూ నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత పీయూష్ గోయల్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పని చేసిన సీఈసీలకు కాంగ్రెస్ లంచాలు ఇచ్చిందన్నారు. ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్ని సీఈసీలకు లంచంగా ప్రకటించిందని పీయూష్ విమర్శించారు. అలాగే, వారికి రాజకీయ పదవులు కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. సీఈసీలకు, ఈసీలకు కాంగ్రెస్ పదవులు ఇచ్చిందన్నారు. మాజీ సీఈసీ ఎంఎస్ గిల్.. ఎన్నికల సంఘం నుంచి పార్లమెంట్‌కు, అక్కడినుంచి కేంద్ర మంత్రిగా మారిన సంగతిని గోయల్ వివరించారు. అంతకుముందు సీఈసీగా కొనసాగిన టీఎన్ శేషన్ పదవీకాలం ముగిసిన వెంటనే గుజరాత్ గవర్నర్‌గా నియమించారని గోయల్ ప్రస్తావించారు.
2005లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నవీన్ చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా నియమించడంలో సోనియా గాంధీ పాత్ర లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న చావ్లా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని 2009లో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి ఆరోపించిన విషయాన్ని కూడా గోయల్ గుర్తు చేశారు. ఇదే సమయంలో ఇటీవల సీఈసీ రాజీనామా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శల్ని, ఆయన తీరును పీయూష్ గోయల్ తప్పుబట్టారు.
రాహుల్ ప్రవర్తన ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోందని, చిన్న పిల్లాడిలా ఆయన ప్రవర్తన ఉందని విమర్శించారు. ఎన్నికల సంఘానికి తమ ఎన్డీయే ప్రభుత్వం పూర్తి స్వతంత్రంగా పని చేసే స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు ఇవ్వలేదని వివరించారు. చట్టపరమైన నిబంధనల్ని ఉల్లంఘించి, రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించలేదన్నారు. ప్రజల కోసం నిజాయితీగా పని చేసేలా చూశామని గోయల్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

