Heart Attack | కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు.. గుండెపోటు మరణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి మాండవీయ సూచన
Heart Attack | దేశంలో రోజురోజుకీ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం.
Heart Attack | న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశంలో రోజురోజుకీ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. కొవిడ్ పేషెంట్స్ అధిక పని ఒత్తిడికి దూరంగా ఉండాలని, తీవ్రమైన శ్రమతో కూడిన వ్యాయామాలు చేయవద్దని సూచించారు.
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనాన్ని ఉటంకిస్తూ కొవిడ్ బాధితులకు ఈ సూచన చేశారు. ‘తీవ్రమైన కొవిడ్-19 ఇన్ఫెక్షన్తో బాధపడ్డవారు.. ఒకటీ లేదా రెండేండ్ల వరకు జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమతో కూడిన తమ పనుల్ని వాయిదా వేసుకుంటే మంచిది’ అని చెప్పారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్లో దసరా పండుగ సమయంలో గార్బా నృత్యం చేస్తూ 10 మందికిపైగా గుండె పోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే.
కొవిడ్ టీకాతో ఆకస్మిక మరణాలు పెరగలేదు
న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ దేశంలో యువత ఆకస్మికంగా మరణించే ముప్పును పెంచలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం వెల్లడించింది. గతంలో కొవిడ్ కారణంగా దవాఖానలో చికిత్స పొందడం, అతిగా మద్యపానం, స్వల్ప సమయంలో తీవ్రంగా శారీరక శ్రమ వంటి ఆకస్మిక మరణ ముప్పును పెంచాయని పేర్కొన్నది. 18-45 సంవత్సరాల మధ్య వయస్కులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

