న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan)కు బెదిరింపు వచ్చింది. పాశ్వాన్‌ను చంపేస్తామని సోషల్ మీడియా ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరించారు. బాంబుతో ఆ నేతపై దాడి చేస్తామని ఆగంతకుడు తన పోస్టులో తెలిపాడు. ఆ పార్టీకి చెందిన ప్రతినిది రాజేశ్ భట్.. ఈ నేపథ్యంలో పాట్నా సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐటీ చట్టంలోని 66ఎఫ్ సెక్షన ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ సైబర్ టెర్రరిజం డీల్ చేస్తుంది. ఇక భారతీయ న్యాయ సంహితలోని 351(2) సెక్షన్ కూడా నమోదు చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చావు బెదిరింపులు చేశారు. టైగర్ మిరాజ్ ఇదిసి పేరుతో ఇన్‌స్టా అకౌంట్ ఉన్నది. పాశ్వాన్‌కు విపరీతమైన పాపులారిటీ వస్తున్న నేపథ్యంలో ఆ బెదిరింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. చంపేస్తామని బెదిరించడం నేరపూరిత ఉద్దేశాన్ని బయటపెడుతుందని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జూలై 11వ తేదీ రాత్రి 9 గంటలకు మంత్రి పాశ్వాన్‌కు ప్రాణహాని బెదిరింపు వచ్చినట్లు సైబర్ డీసీపీ నితీశ్ చంద్ర ధరియా తెలిపారు. పాట్నా సైబర్ పోలీస్ స్టేషన్లోకేసు బుక్ చేశారు.