Kendriya Vidyalaya | కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా.. ఆ ఊహాగానాలపై కేంద్రం స్పష్టత
Kendriya Vidyalaya | దేశంలోని కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా సహా పలు కోటాలను కేంద్రం గతేడాది రద్దు చేసిన విషయం విదితమే. కేవీల్లో ఎంపీల కోటాను పునరుద్ధరించే అవకాశం లేనేలేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
Kendriya Vidyalaya | న్యూఢిల్లీ : దేశంలోని కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీ కోటా సహా పలు కోటాలను కేంద్రం గతేడాది రద్దు చేసిన విషయం విదితమే. కేవీల్లో ఎంపీల కోటాను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ ఊహాగానాలపై కేంద్రం స్పందించింది. కేవీల్లో ఎంపీల కోటాను పునరుద్ధరించే అవకాశం లేనేలేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేసే సిబ్బంది తరచూ బదిలీలపై వెళ్తుంటారు. కాబట్టి వారి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా దేశ వ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా కేవీలను ప్రారంభించారు అని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేవీల్లో ప్రవేశాలకు ఎంపీ సహా ఇతర కోటాలను అనుమతిస్తే తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఇది బోధనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే కేవీల్లో ఎంపీల కోటాను రద్దు చేశాం. ఎంపీ కోటాను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతిపాదనేది ప్రస్తుతానికి కేంద్రం వద్ద లేదని అన్నపూర్ణ దేవి స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

