Jamili Election | దేశంలో జమిలి ఎన్నికలు కష్టమే..! పార్లమెంటు, అసెంబ్లీ రెండూ ఒకేసారి సాధ్యం కావు : కేంద్రం
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనతో వీటికి చెక్ పెట్టినట్లయ్యింది.
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనతో వీటికి చెక్ పెట్టినట్లయ్యింది. జమిలి ఎన్నికలపై రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల విధానసభ ఎన్నికలు నిర్వహణ అంత తేలిక కాదన్నారు.
ఒకేసారి ఎన్నికలు జరుపడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, అయితే ఇందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు సైతం ఉన్నాయన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమని.. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరమని, అందుకు రూ.వేలకోట్లు ఖర్చవుతాయన్నారు. ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
అదే సమయంలో ఒకేసారి జరిగే ఎన్నికలకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరమవుతాయన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని, తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యులకు ఇచ్చిన లిఖిత్వపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

