ఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ గురువారం నిర్ణయం వెలువరించింది. అజయ్‌భల్లా పదవీకాలం ఈ నెల 22తో ముగియనుంది. అసోం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన అజయ్‌భల్లా ఆగస్టు 2019లో హోంశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.